Rakesh Jhunjhunwala: రూ.426 కోట్లు నష్టపోయిన రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా

Rakesh Jhunjhunwala: భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిన టైటాన్‌, స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌

Rama Rao
Updated on: 12 Feb 2022 5:00 PM IST
Stock Trader Rakesh Jhunjhunwala Suffered heavy losses | Telugu News Today
X

Rakesh Jhunjhunwala: భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిన టైటాన్‌, స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌

Rakesh Jhunjhunwala: షేర్‌ మార్కెట్‌ బిగ్‌ బుల్‌గా పేరొందిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా భారీ నష్టాన్ని చవిచూశారు. రెండు కంపెనీల్లో ఆయన షేర్ల విలువ గణనీయంగా తగ్గడంతో ఒక్కరోజే 426 కోట్ల రూపాయలు నష్టపోయారు. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఫేవరెట్‌ అయిన టైటాన్‌ కంపెనీతోపాటు స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఈ భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి.

టైటాన్‌లో రాకేశ్‌కు 4.02శాతం, ఆయన సతీమణికి 1.07శాతం షేర్లు ఉన్నాయి. అంటే ఈ కంపెనీతో వీరి మొత్తం షేర్ల విలువ 5.09శాతంగా ఉంది. శుక్రవారం మార్కెట్‌ ట్రేడింగ్‌లో టైటాన్‌ కంపెనీ ఒక్కోషేరు ధర 53రూపాయల 20పైసలుగా కుంగింది. దీంతో ఈ కంపెనీ ద్వారా రాకేశ్ దంపతులకు 240 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది.

ఇక స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో రాకేశ్‌, ఆయన సతీమణి షేర్ల వాటాల విలువ 17.50శాతం. అంటే దాదాపు 10కోట్లకుపైనే షేర్లు ఉన్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో స్టార్‌ హెల్త్‌ షేరు ధర 18రూపాయల 55పైసలు తగ్గింది. దీంతో ఝున్‌ఝున్‌వాలా నికర సంపద దాదాపు 186 కోట్ల మేర తరిగింది. అలా ఈ రెండు కంపెనీల ద్వారా శుక్రవారం ఒక్కరోజే ఆయన 426 కోట్ల మేర నష్టపోయినట్టు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story