పేషెంట్ కడుపులో పెద్ద స్టీల్ గ్లాసు.. సర్జరీ చేసి తొలగించిన వైద్యులు..

Steel Glass in Stomach: ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్‌లో వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 6 Aug 2022 4:55 PM IST
Steel Glass Removed from Patient Stomach in Uttar Pradesh
X

పేషెంట్ కడుపులో పెద్ద స్టీల్ గ్లాసు.. సర్జరీ చేసి తొలగించిన వైద్యులు..

Steel Glass in Stomach: ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్‌లో వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను నిర్వహించారు. కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తికి వైద్యులు ఎక్స్‌రే తీయంగా రోగి శరీరంలో గ్లాసు ఆకారంలో ఏదో వస్తువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రోగికి సుమారు గంటపాటు శ్రమించి రోగి కడుపులో నుంచి విజయవంతంగా స్టీల్ గ్లాసును తొలగించారు.

జాన్‌పుర్ జిల్లాలోని గోత్వా భటౌలీ గ్రామానికి చెందిన సమరనాథ్ కొన్ని రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే అక్కడి వైద్యులు ఆయనను పరీక్షించగా కడుపులో స్టీల్‌ గ్లాసు ఉన్నట్లు గుర్తించారు. అయితే రోగి కడుపులోకి అంతపెద్ద స్టీల్ గ్లాస్ ఎలా చేరిందని సమరనాథ్ భార్య మనోరమను వైద్యులు అడగగా తన భర్తకు హెర్నియా ఉందని తెలిపింది. చాలా రోజుల నుంచి తన భర్త సరిగా తినడంలేదని తెలిపింది. మలమూత్త విజర్జనకు సైతం వెళ్లడంలేదని చెప్పింది. అయితే స్టీలుగ్లాసు కడుపులోకి ఎలా వెళ్లిందని సమరనాథ్‌ను అడగ్గా నోటి ద్వారా వెళ్లిందని చెప్పాడు. అయితే అతను చెప్పింది అబద్దమని నోటి ద్వారా గ్లాసు కడుపులోకి వెళ్లే అవకాశంలేదని డాక్టర్లు చెప్తున్నారు. స్టీలు గ్లాసు కచ్చితంగా మలద్వారం నుంచే కడుపులోకి వెళ్లి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story