రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
* రేపు ఉ.10 గంటల నుంచి ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవా టికెట్ల విడుదల
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Tirumala Tirupati Devasthanam: రేపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ. 2023 జనవరి నెలకు గాను ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవా టికెట్లు విడుదల కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ పద్ధతిలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. టీటీడీ వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లను బుక్ చేసువాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Next Story




