Kerala: ఏమండీ.. ఇక మీరే చూసుకోండి!

Kerala: కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 28 July 2022 1:25 PM IST
Sriram Venkitraman Takes Over as Alappuzha Collector From Wife Renu Raj
X

Kerala: ఏమండీ.. ఇక మీరే చూసుకోండి!

Kerala: కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్‌గా ఉన్న రేణు రాజ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో శ్రీరామ్ వెంకట్రామన్‌ను నియమించింది. బదిలీ అయిన రేణు రాజ్‌కు శ్రీరామ్ భర్త కావడమే ఇందులో విశేషం.

రేణు రాజ్‌, శ్రీరామ్‌ గతంలో వైద్యులుగా పనిచేశారు.. కానీ, ఆ తర్వాత ఐఏఎస్‌లుగా మారిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలోనే వీరి పెళ్లి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీరామ్ మంగళవారం భార్య రేణు నుంచి అలప్పుళ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన సీటులో కూర్చోవల్సిందిగా శ్రీరామ్‌ను ఆహ్వానించిన రేణు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి చైర్‌లో కూర్చోబెట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story