SpiceJet: స్పైస్ జెట్ విమానంలో పొగ‌లు.. ఊపిరాడ‌క ఇబ్బందిప‌డ్డ ప్ర‌యాణికులు !

SpiceJet: స్పైస్ జెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పిపోయింది.

Arun Chilukuri
Published on: 2 July 2022 1:15 PM IST
SpiceJet Flight Makes Emergency Landing
X

SpiceJet: స్పైస్ జెట్ విమానంలో పొగ‌లు.. ఊపిరాడ‌క ఇబ్బందిప‌డ్డ ప్ర‌యాణికులు !

SpiceJet: స్పైస్ జెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పిపోయింది. విమానం ఆకాశంలో 5వేల అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్‌ నుంచి పొగలు వచ్చాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించి సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ జబల్‌పూర్ ‌కు స్పైస్ జెట్ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపట్లో విమానం 5వేల అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్‌లో పొగాలు వచ్చాయి. గుర్తించి అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. క్యాబిన్‌లో పొగలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story