Satyendra Jain: తీహార్ జైలులో ఆప్ మంత్రికి వీఐపీ ట్రీట్‌మెంట్..!

* బయటకు వచ్చిన జైల్లో మసాజ్ వీడియోలు

R Tripura Malini
Updated on: 19 Nov 2022 2:15 PM IST
బయటకు వచ్చిన జైల్లో మసాజ్ వీడియోలు
X

తీహార్ జైలులో ఆప్ మంత్రికి వీఐపీ ట్రీట్‌మెంట్.. బయటకు వచ్చిన జైల్లో మసాజ్ వీడియోలు

Satyendra jain: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైలులో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు.. వీఐపీ ట్రీట్‌మెంట్‌ అందుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జైల్లో ఆయన మసాజ్‌ చేయించుకుంటున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. జైల్లో జైన్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని, వీఐపీ ట్రీట్‌మెంట్‌ అందుతోందని ఈడీ.. కోర్టుకు తెలిపిన కొన్నిరోజులకే ఈ వీడియో బయటకు వచ్చింది. ఓ వ్యక్తితో తల, కాళ్లకు మసాజ్‌ చేయించుకుంటున్న ఫుటేజీ ఇది. సెప్టెంబర్‌లోనే ఇది జరిగినట్లు ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకమైన సదుపాయాలు.. పక్కనే మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ ప్యాక్‌ కూడా గమనించవచ్చు. సత్యేంద్ర జైన్‌కు VIP ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకు తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌ను సస్పెండ్ చేసిన కొన్ని రోజులకే ఈ వీడియో బయటకు వచ్చింది. ఇప్పటికే సంబంధిత అధికారులు, సిబ్బందిపై జైలు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మే 30న మనీలాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌ అరెస్ట్‌ అయ్యారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story