Parliament Special Session: ఇవాళ్టి నుంచి ఐదురోజుల పాటు పార్లమెంట్ స్పెషల్ సెషన్స్

Parliament Special Session: ఉ.10.15 గం.కు మీడియాతో మాట్లాడనున్న ప్రధాని మోడీ

Jyothi
Published on: 18 Sept 2023 10:05 AM IST
Special Sessions of Parliament for Five Days from Today
X

Parliament Special Session: ఇవాళ్టి నుంచి ఐదురోజుల పాటు పార్లమెంట్ స్పెషల్ సెషన్స్

Parliament Special Session: ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంట 15 నిమిషాలకు పార్లమెంట్‌లో ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడనున్నారు. పార్లమెంట్ 75 సంవత్సరాల ప్రస్థానంపై లోక్‌సభలో ఆయన ప్రసగించనున్నారు. మరో వైపు పాత పార్లమెంట్‌ బిల్డింగ్‌లో ఇవే చివరి సమావేశాలు కానున్నాయి.

రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు కొనసాగనున్నాయి. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని విపక్షపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 1996 సంవత్సరం నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం లభించడంలేదు. రేపు ఉదయం పదకొండున్నర గంటలకు నూతన పార్లమెంట్ బిల్డింగ్‌లో ఉభయసభలు ప్రారంభంకానున్నాయి.

Jyothi

Jyothi

Next Story