ఉక్రెయిన్‌ బాధితుల కోసం తెలంగాణ సర్కార్ హెల్ప్ లైన్

Hyderabad: హెల్ప్‌లైన్ సెంటర్లకు 75 కాల్స్ వచ్చాయన్న ప్రభుత్వం.

Sriveni Erugu
Updated on: 25 Feb 2022 1:55 PM IST
ఉక్రెయిన్‌ బాధితుల కోసం తెలంగాణ సర్కార్ హెల్ప్ లైన్
X

ఉక్రెయిన్‌ బాధితుల కోసం తెలంగాణ సర్కార్ హెల్ప్ లైన్

Hyderabad: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారి కోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌ లైన్లు అందుబాటులో ఉన్నాయి. హెల్ప్‌లైన్‌ సెంటర్లకు రాత్రి నుండి 75 కాల్స్ వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ యోగ క్షేమాల కోసం భారత విదేశీ మంత్రిత్వ శాఖతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ముఖ్య కార్యదర్శి , ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ సంబంధిత అధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story