New Parliament Building: ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మోడీ కానుక

New Parliament Building: ప్రత్యేక పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటేరియన్లకు మోడీ కానుకను సిద్ధం చేశారు.

Arun Chilukuri
Published on: 19 Sept 2023 10:16 AM IST
Special Gifts for MPs on Parliaments Spl Session
X

New Parliament Building: ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మోడీ కానుక

New Parliament Building: ప్రత్యేక పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటేరియన్లకు మోడీ కానుకను సిద్ధం చేశారు. రాజ్యాంగం, పార్లమెంటుకు సంబంధించిన పుస్తకాలతో ప్రత్యేక జనపనార సంచిలో పెట్టి పంపిణీ చేయనున్నారు. ఇవాళ కొత్త పార్లమెంటు భవనంలో సభ్యులకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. జనపనారతో రూపొందించిన బ్యాగులో భారత రాజ్యాంగ ప్రతి, పాత, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం వారికి ఇవ్వనుంది. ఇక, ఆ బ్యాగులపై ఎంపీల పేర్లు రాసి ఉన్నాయి. ప్రధాని మోడీ సైతం పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్‌కు రాజ్యాంగ ప్రతిని తన వెంట తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిని ఎంపీలు అనుసరించనున్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story