కాంగ్రెస్‌లో చేరిన సోనూసూద్ సోదరి.. అక్కడి నుంచి బరిలోకి..

Sonu Sood Sister Malvika Sood Joins in Congress
x

కాంగ్రెస్‌లో చేరిన సోనూసూద్ సోదరి.. అక్కడి నుంచి బరిలోకి..

Highlights

Punjab Assembly Elections: పంజాబ్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Punjab Assembly Elections: పంజాబ్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రియల్ హీరో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ సచార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన స్వస్థలం పంజాబ్‌లోని మోగా నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోకి మాళవిక దిగనున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్వయంగా సూద్ నివాసానికి వెళ్లి సోనూతో పాటు మాళవికతో మాట్లాడారు. అనంతరం పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, సిద్ధూల సమక్షంలో మాళవికా సూద్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

మరోవైపు మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై పీసీసీ చీఫ్ సిద్ధూ స్పందించారు. పంజాబ్ ఎన్నికల వేళ ఈ డెవలప్ మెంట్‌ని గేమ్ చేంజర్‌గా అభివర్ణించారు. మాళవికా సూద్ చాలా యంగ్ అని బాగా చదువుకున్నారన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన మాళవికకు భవిష్యత్తులో ముందుకు సాగడానికి ఇవన్నీ తోడ్పడతాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని మాళవికా సూద్ చెప్పారు. ఇక ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories