నేడు అసంతృప్తి నేతలతో సోనియాగాంధీ భేటీ

Arun Chilukuri
Updated on: 19 Dec 2020 10:50 AM IST
నేడు అసంతృప్తి నేతలతో సోనియాగాంధీ భేటీ
X

పార్టీ అగ్రనాయకత్వంపై లేఖాస్త్రం సంధించి తిరుగుబావుటా ఎగురువేసిన సీనియర్లతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇవాళ భేటీ కానున్నారు. రెండురోజులపాటు 23మంది నేతలతో ఆమె సమావేశాలు జరపనున్నారు. అసమ్మతి నేతలు లేవనెత్తిన అంశాలతోపాటు పార్టీ ప్రక్షాళన, సంస్థాగత ఎన్నికలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ కూడా పాల్గొననున్నారు.

రాహుల్‌కు పార్టీ పగ్గాలు తిరిగి అప్పగించడానికి ఓ ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీకి ఓ మంచి టీమ్‌ ఏర్పాటు చేసి కీలకాంశాలపై సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లేలా వ్యూహరచన సాగించాలని సోనియాగాంధీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story