నేడు ఈడీ ముందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ

*నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు

Rama Rao
Published on: 21 July 2022 6:39 AM IST
Sonia Gandhi to Appear Before ED in National Herald Case
X

నేడు ఈడీ ముందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాను ఈడీ విచారించనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు సోనియా హాజరుకానున్నారు. ఇదే అంశంపై ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జనరల్‌ సెక్రటరీలు, సెక్రటరీలు, ఎంపీలు హాజరుకావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈడీ విచారణ, తదనంతరం జరిగే పరిణామాలు సహా ఇతర ముఖ్యాంశాలను పార్టీ సీనియర్ నేతలు చర్చించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story