Sonia Gandhi: సోనియా గాంధీకి మరోసారి కరోనా..

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు.

Arun Chilukuri
Published on: 13 Aug 2022 3:19 PM IST
Sonia Gandhi Tests Positive for Covid, Second Time
X

Sonia Gandhi: సోనియా గాంధీకి మరోసారి కరోనా..

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ప్రొటోకాల్‌ ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని జైరామ్‌ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌ అధికారిక ట్విటర్‌ పేజీ సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేసింది.

కాగా,రెండు నెలల వ్యవధిలో సోనియా గాంధీ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్ లో క‌రోనా బారిన ప‌డిన సోనియా గాంధీ..వారం రోజుల వ్య‌వ‌ధిలోనే సోనియా కోలుకుంది. మరోవైపు,బుధవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా మూడు నెలల్లో రెండవ సారి కరోనా బారినపడినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story