సోనియా గాంధీకి మరోసారి కరోనా..

Sonia Gandhi: ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు

Jyothi
Updated on: 14 Aug 2022 7:49 AM IST
Sonia Gandhi Covid Positive | Telugu News
X

సోనియా గాంధీకి మరోసారి కరోనా..

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జూన్ 2న సోనియాగాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వారం రోజుల వ్యవధిలోనే కోలుకున్నప్పటికీ కొవిడ్ సంబంధిత సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. దాంతో ఆమె జూన్ 12న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకున్నాక నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు.ఈ క్రమంలో సోనియా కూతురు ప్రియాంకా గాంధీకి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నిన్న సోనియాకు మళ్లీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Jyothi

Jyothi

Next Story