Congress: కరోనాను అరికట్టడంలో మోడీ సర్కార్‌ విఫలం- సోనియా

Congress: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పార్టీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Arun Chilukuri
Updated on: 10 April 2021 9:31 PM IST
Sonia Gandhi Chaired a Virtual Meeting
X

Congress: కరోనాను అరికట్టడంలో మోడీ సర్కార్‌ విఫలం- సోనియా

Congress: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పార్టీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను అరికట్టడంలో మోడీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. కరోనాను అరికట్టడడానికి టెస్టింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ మాత్రమే మార్గాలని సోనియా వివరించారు. కరోనా కేసులు, మరణాల విషయంలో నిజాయితీగా ఉండాలని సూచించారు. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు, మిగతా రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని సోనియా స్పష్టం చేశారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేయడాన్ని కూడా కాంగ్రెస్‌ అధినేత తప్పుపట్టారు. దేశ అవసరాలు తీరిన తర్వాతే ఇతర దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story