గుజరాత్‌లో మోదీకి ఘన స్వాగతం

Narendra Modi - Gujarat Tour: అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి.. రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు భారీ రోడ్‌ షో

Rama Rao
Updated on: 11 March 2022 2:15 PM IST
Solid Welcome to PM Narendra Modi in Gujarat | National News
X

గుజరాత్‌లో మోదీకి ఘన స్వాగతం

Narendra Modi - Gujarat Tour: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల పర్యటకు గుజరాత్‌కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి పార్టీ కార్యాలయం వరకు నిర్వహించిన రోడ్‌ షోలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొని మోదీకి అభివాదం చేశారు. ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రయాణిస్తూ.. ప్రజలకు మోదీ అభివాదం తెలిపారు.

గుజరాత్‌లో ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ ఏడాది చివర జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం జీఎండీసీ గ్రౌండ్‌లో నిర్వహించే మహా పంచాయత్‌ సమ్మేళనం... మారు గ్రామ్‌ మారు గుజరాత్‌ కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు. కొత్తగా ఎన్నికైన లక్షా 38వేల మంది స్థానిక సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఇవే కాకుండా పలు సంస్కృతిక కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు.

Rama Rao

Rama Rao

Next Story