Indian Army: సెల్యూట్ సైనికా..!

Indian Army: భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించిన సైనికులు

Rama Rao
Updated on: 26 Jan 2022 8:27 AM IST
Soldiers Celebrating the 73rd Republic Day | National News Today
X

 సెల్యూట్ సైనికా..!

Indian Army: ఎముకలు కొరికే చలి.. అడుగుల మేర పేరుకుపోయిన మంచు అడుగు తీసి అడుగు వేయలేని ప్రతికూల పరిస్థితులు.. ఇలాంటి సమయంలోనూ దేశ భద్రతలో రాజీలేదు. ఒక్క క్షణం ఏమరపాటు లేకుండా బోర్డర్‌లో పహారా కాస్తున్నారు ఇండియన్ సోల్జర్స్.! యావద్ దేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఎలాంటి ఉతగ్రమూకలు బోర్డర్ క్రాస్ చేయకుండా.. ప్రతికూల వాతావరణంలోనూ విధులు నిర్వర్తిస్తూ సెల్యూట్ సైనికా అనిపించుకుంటున్నారు ఆర్మీ జవాన్లు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమలో అణువణువునా నిండిఉన్న దేశభక్తిని చాటుకుంటున్నారు భారత జవాన్లు. జమ్ముకశ్మీర్‌లోని మారాముల్లాలో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు.. త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తించారు. 73వ గణతంత్ర దినోత్సవం సాక్షిగా దేశంపట్ల సైనికుల అంకిత భావానికి యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rama Rao

Rama Rao

Next Story