కరోనా కన్నా దారుణంగా సోషల్ మీడియా!

కరోనా కన్నా దారుణంగా సోషల్ మీడియా!
x
Highlights

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ఈ హృదయ విదారక నేపధ్యాన్నిఆసరాగా చేసుకుని కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో విష ప్రచారానికి వాడుకుంటున్నారు....

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ఈ హృదయ విదారక నేపధ్యాన్నిఆసరాగా చేసుకుని కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో విష ప్రచారానికి వాడుకుంటున్నారు. అందరూ ఎక్కువగా నమ్మే ఆధ్యాత్మిక అంశాలను సాకుగా చేసుకుని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.

కరోనా కొందరు అసాంఘీక శక్తుల పాలిట అవకాశంగా మారుతోంది. ఇదే అదనుగా విష ప్రచారానికి పాల్పడి కొందరు శునకానందం పొందుతున్నారు. అశేష భక్త జన కోటి ప్రాణ ప్రదంగా నమ్మిన తిరుమల వెంకన్న పైనా ఈ రూమర్లను కొన్ని అసాంఘీక శక్తులు వ్యాప్తి చేస్తున్నాయి.

రూమర్ 1: గర్భ గుడిలో స్వామి వారి అఖండ దీపం కొండెక్కిందని.. కొందరు దుష్ప్రచారం చేశారు.. అయితే ఈ రూమర్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. అలాగే మాడ వీధుల్లో వరాహం తిరిగిందని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉందని వైరల్ అయిన వీడియో కూడా తప్పుడుదే.

రూమర్ 2: కాణీపాకం దేవాలయాన్ని క్వారంటైన్ సెంటర్ గా మార్చారని కొందరు చెప్పులతో అక్కడకి ప్రవేశించారనీ సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారమవుతున్నాయి. అయితే ఆ వీడియోలో చూపిస్తున్నది కాణీపాకం ఆలయం కాదు.. అదొక వసతి గృహం.

రూమర్ 3: లాక్ డౌన్ నేపధ్యంలో పేదలు, వలస కూలీలు బాగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం వారి ఇబ్బందులు తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి వారికి భోజన, వసతి సదుపాయాలు శక్తి మేరకు కల్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే లాక్ డౌన్ వల్ల పనులు దొరక్క ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే ఈ చిత్రం కర్ణాటకలో తాగుబోతు భర్తను భరించలేక ఒక ఇల్లాలు ముగ్గురు పిల్లలను చెట్టుకు ఉరివేసి చంపి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆసంఘటన తాలూకు చిత్రాలను లాక్ డౌన్ చిత్రాలుగా కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు.

రూమర్ 4: కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉన్నా మోడీ హోం స్టేట్ గుజరాత్ లో శ్రీరామ నవమి ఉత్సవాలు యధా ప్రకారం జరుపుకున్నారని కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అవి కూడా తప్పుడు వార్తలే పాత దృశ్యాలనే జత చేసి కొందరు కావాలనే వైరల్ చేశారు.

రూమర్ 5: ఒక మతానికి చెందిన వ్యక్తి కరోనా టెస్టులకు సహకరించకుండా పోలీసులపై ఉమ్మేశారని ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. కానీ అది కూడా తప్పుడు వార్తే జమ్మూ కశ్మీర్ లో అతనొక అండర్ ట్రయల్ ఖైదీ ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని తినేందుకు పోలీసులు ఒప్పుకోకపోవడంతో వారిపై ఉమ్మేసిన ఘటన అది.

ఇలా సోషల్ మీడియాలో పాత దృశ్యాలకు కొత్త కామెంట్లు జత చేసి కొందరు అసాంఘీక శక్తులు వాటిని వైరల్ గా మారుస్తున్నారు. ప్రజలెవరూ ఈ వార్తలను నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories