దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు మరణాలు

India: కొత్తగా 71,365 మందికి వైరస్ నిర్ధారణ... 24 గంటల్లో 1,217 మరణాలు.

Sriveni Erugu
Published on: 9 Feb 2022 11:26 AM IST
Slightly increased corona cases and deaths in the country
X

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు మరణాలు

India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే మూడు వేల కేసులు పెరిగాయి. మంగళవారం 67 వేల కేసులు నమోదు కాగా.. తాజాగా 71 వేలకు చేరాయి. ఇది నిన్నటికంటే 5.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశంలో కొత్తగా 71వేల 365 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.24 కోట్లు దాటాయి. మరోవైపు మరణాలు భారీగా పెరిగాయి. 24గంటల్లో 1217 మంది మరణించారు.

ఇందులో 5లక్షల 5వేల మంది బాధితులు మృతిచెందగా, దేశంలో కొత్తగా 71,365 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976కు చేరింది. ఇందులో 5,05,279 మంది బాధితులు మృతిచెందగా, 8,92,828 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,10,12,869 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో 1,72,211 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడగా, 1,217 మంది మరణించారు.మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2.11 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతానికి తగ్గిందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,70,87,06,705 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story