కమెడియన్‌ ఎవరంటూ పంజాబ్‌లో చర్చ..

Sidhu Judged Bhagwant Mann in a Comedy Show
x

కమెడియన్‌ ఎవరంటూ పంజాబ్‌లో చర్చ..

Highlights

Bhagwant Mann: పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ ప్రభంజనం సృష్టించింది.

Bhagwant Mann: పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ ప్రభంజనం సృష్టించింది. త్వరలో ముఖ్యమంత్రిగా అప్‌ నేత భగవంత్‌ సింగ్‌ మన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే సమయంలో చీపురు దెబ్బకు కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ సిద్దూ అమృత్‌సర్‌ ఈస్ట్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఈ ఇద్దరి నేతల గురించి తాజాగా ఓ చర్చ జోరుగా సాగుతోంది. 2006లో స్టార్ ప్లస్‌లో ప్రసారమైన కామెడీ షోలో భగవంత్‌ మన్‌ కామెడీ చేయగా. ఆ కార్యక్రమానికి సిద్దూ జడ్జీగా వ్యవహరించారు. భగవంత్‌ మన్‌ వేసిన జోక్‌కు సిద్దూ పగలబడి నవ్వారు ఇప్పుడు ఎవరు కమెడియన్‌ అని...? ఎవరు నవ్వుల పాలయ్యారని జోరుగా చర్చించుకుంటున్నారు.

స్టార్‌ ప్లస్‌కు గ్రేట్‌ ఇండియన్‌ లాఫర్‌ చాలెంజ్‌ షోకు చెందిన ప్రోమో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులోనూ గార్నమెంట్‌ అంటే ఏమిటని ఓ రాజకీయ నాయకుడిని అడిగానని కళ్లలోకి కళ్లుపెట్టి చూసి ఆ క్షణంలో మరచిపోవడమని జోక్ చేశాడు భగవంత్‌ మన్‌.. పంజాబీలో గార్ అంటే.. కళ్లలోకి కళ్లు పెట్టి సీరియస్‌గా చూడడం.. మింట్‌.. అంటే నిమిషం.. అంటే.. కళ్లలోకి కళ్లు పెట్టి సీరియస్‌గా చూసి.. క్షణంలోనే మరచిపోవడమని అర్థం.. ఆ జోక్‌ విని.. జడ్జీగా ఉన్న సిద్దూ పగలబడి నవ్వారు.


Show Full Article
Print Article
Next Story
More Stories