Navjot Singh Sidhu: కెప్టెన్‌ వర్గంలో సిద్ధూ కలవరం

Navjot Singh Sidhu: పంజాబ్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేతికందిన సిద్ధూ దూకుడు పెంచారు.

Arun Chilukuri
Published on: 21 July 2021 9:06 PM IST
Sidhu Hosts 62 Congress MLAs as Tussle with Amarinder Continues
X

Navjot Singh Sidhu: కెప్టెన్‌ వర్గంలో సిద్ధూ కలవరం

Navjot Singh Sidhu: పంజాబ్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేతికందిన సిద్ధూ దూకుడు పెంచారు. పీసీసీ చీఫ్‌గా నియమితుడై పంజాబ్ చేరుకున్న మరునాడే ఎమ్మెల్యేలకు విందులు, వారితో ఆలయాల సందర్శనలు చేస్తూ బలప్రదర్శన చేశారు. ఇవాళ అమృత్‌సర్‌ నివాసంలో తన పార్టీలోని 62 మంది ఎమ్మెల్యేలకు సిద్దూ విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్, దుర్గియానా ఆలయాలను ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని సందర్శించారు. ఇక ఈనెల 23న పీసీసీ పగ్గాలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారవగా సీఎంను కలవాల్సిన ఫార్మాలిటీని కూడా పక్కనపెట్టారు సిద్దూ. దీంతో ఇప్పటికే అసంతృప్తితో రగులుతున్న కెప్టెన్ వర్గానికి సిద్దూ దూకుడు కంటగింపుగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story