logo
జాతీయం

రెచ్చిపోయిన శివసేన ఎమ్మెల్యే.. క్యాటరింగ్ మేనేజర్‌ పై చేయి చేసుకున్న..

Shiv Sena MLA Attacks Catering Manager
X

రెచ్చిపోయిన శివసేన ఎమ్మెల్యే.. కేటరింగ్‌ మేనేజర్‌ పై చేయి చేసుకున్న..

Highlights

Maharashtra: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే రెచ్చిపోయాడు.

Maharashtra: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. ఓ క్యాటరింగ్ మేనేజర్ పై ఎమ్మెల్యే సంతోష్ బాంగర్ చేయి చేసుకున్నాడు. నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని అతని చెంప చెల్లుమనిపించాడు. హింగోలీ జిల్లాలో కార్మికులకు మధ్యాహ్నం భోజనాన్ని నాణ్యత లేకుండా అందిస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ ఫిర్యాదు మేరకు తాను తనిఖీ చేసినట్లు చెప్పారు. దీంతో కార్మికులకు మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని చేపడుతున్న క్యాటరింగ్ మేనేజర్ ను ఎమ్మెల్యే నిలదీశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Web TitleShiv Sena MLA Attacks Catering Manager
Next Story