ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన శివసేన.. గతంలో నాలుగు సార్లు రాజకీయ సంక్షోభం

Shiv Sena Faces 4th Rebellion
x

ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన శివసేన.. గతంలో నాలుగు సార్లు రాజకీయ సంక్షోభం

Highlights

*తాజాగా ఏక్‌నాథ్ షిండే రూపంలో మరోసారి తిరుబాటు

Shiv Sena: ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన శివసేన ‌పార్టీకి ఇలాంటి రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనే నాలుగు సార్లు శివసేన రాజకీయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నది. 1991లో తొలిసారిగా ఎదురు దెబ్బ తగిలింది. ప్రతిపక్షనేతగా మనోహర్ జోషీని నియమించడంతో ఓబీసీ నేత చగన్ భుజ్ బల్ 18 మంది ఎమ్మెల్యేలతో శివసేనపై తిరుగుబావుటా ఎగురవేశారు. అప్పట్లో బాల్‌థాక్రే భుజ్‌బల్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అయితే, అదేరోజు 12 మంది రెబల్ ఎమ్మెల్యేలు సొంత గూడు శివసేనలో చేరారు. ఆ తర్వాత భుజ్‌బల్‌ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. అప్పుడు పార్టీ బలం 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

2005లోనూ ఇలాంటి సవాల్ నే ఎదుర్కొన్నది. మాజీ సీఎం నారాయణ రాణే 40 మంది ఎమ్మెల్యేలతో పార్టీకి వ్యతిరేకంగా క్యాంప్ పెట్టారు. ఉధ్దవ్ థాక్రే రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. అయితే రాణే వ్యూహాన్ని శివసేన కొంత వరకు చేధించి రెబల్స్ లోని 28 మంది ఎమ్మెల్యేల మద్దతును మళ్లీ కూడగట్టుకోగలిగింది. 12 మందిని సస్పెండ్ చేయడంతో రాణే సహా వారంతా కాంగ్రెస్ లో చేరారు.

ఇక 2006లో పార్టీలో కొందరి పెత్తనం పెరిగిపోయిందంటూ ఆరోపిస్తూ బాల్‌ఠాక్రే మేనల్లుడు రాజ్‌థాక్రే పార్టీని వీడారు. మహారాష్ర్ట నవ్ నిర్మాణ్ సేన పేరుతో పార్టీని స్థాపించారు. తాజాగా ఏక్ నాథ్ షిండే రూపంలో మరోసారి తిరుబాటును ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో రెబెల్స్‌ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అవిశ్వాసం పడితే ఫలితం ఏ విధంగా ఉండబోతుందన్నది ఉత్కంఠ కల్గిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories