Suez Canal: హమ్మయ్య.. కాస్త బెటర్..సూయిజ్ కాలువలో కదిలిన భారీ నౌక

Ship Blocking Suez Canal Moves Slightly
x

Suez కెనాల్:(ఫైల్ ఇమేజ్)

Highlights

Suez Canal: జలమార్గం సూయజ్ కెనాల్ లో ఇరుక్కుపోయిన భారీ నౌక కొద్దిగా కదిలినట్లు అధికారులు ప్రకటించారు.

Suez Canal: ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జలమార్గం సూయజ్ కెనాల్ లో భారీ నౌక కొద్దిగా కదిలినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మానవ నిర్మిత కాలనీలో ఆరు రోజుల నుంచి చిక్కుకున్న ఎవర్ గివెన్ నౌక ప్రయాణం మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేమన్నారు. సూయాజ్ కాలువ ఆథారిటీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఎవర్ గివెన్ నౌకను ప్రయాణానికి అనువుగా తిప్పేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. ఈ నౌక ఒక మూల నుంచి మరొక మూలకు చిక్కుకుపోవడంతో ప్రపంచంలో రద్దీగా ఉండే ఈ జలమార్గానికి ఆటంకం ఏర్పడిందని తెలిపారు.

ఇసుకను తవ్వి టగ్ బోట్స్ తో లాగడం వంటి చర్యల ద్వారా శనివారం ఈ నౌకను కొద్దిగా కదిలించగలిగామని తెలిపారు. సుమారు 30 డిగ్రీల మేరకు కదిలిందని పేర్కొన్నారు. ఈ నౌక కింద నీటి ప్రవాహం మొదలైందని తెలిపారు. త్వరలోనే నౌక ప్రస్తుత ప్రదేశం నుంచి పూర్తిగా కదులుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం ఇసుక తుఫాన్ తో ఈ ఎవర్ గివెన్ నౌక కాలువలో చిక్కుకుంది. దీంతో వందలాది నౌకలు అటు ఇటు ఆగిపోయాయి. ఇప్పటికే నౌక చుట్టు ఉన్న ఇసుకలో 20వేల టన్నుల ఇసుకను తొలగించారు. కాస్త కదిలించారు.

మధ్యధరా, హిందూ మహాసముద్రాలను కలుపుతూ ఈజిప్టులో కృత్రిమంగా నిర్మించారు. 1869లో ఇది ప్రారంభమైంది. దీని పొడవు 193 మీటర్లు, వెడల్పు 200 మీటర్లు. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 10-12 శాతం ఈ కాలువ మీదుగా నౌకల ప్రయాణం సాగుతోంది. రోజుకూ 50కి పైగా ఓడలు దీని గుండా ప్రయాణిస్తాయి. ఈ నెల 23న సూయిజ్ కాలువ దక్షిణ ద్వారం నుంచి 3.7 మైళ్లు ప్రయాణించిన తర్వాత ఇసుక తుపాను, తీవ్ర గాలుల ధాటికి ' ఎవర్ గివెన్ ' నియంత్రణ కోల్పోయి అడ్డంగా తిరిగింది. నౌక ముందు భాగం కాలువ అంచున ఉన్న ఇసుక, బంక మట్టిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories