Himachal Pradesh: సిమ్లాలో జోరుగా మంచువర్షం
Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో మంచు వర్షం జోరుగా కురుస్తోంది.
Himachal Pradesh: సిమ్లాలో జోరుగా మంచువర్షం
Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో మంచు వర్షం జోరుగా కురుస్తోంది. ఎత్తైన మైదాన ప్రాంతాల్లో అత్యధికంగా మంచు వర్షం కురుస్తోంది. పర్యాటకులు మంచు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇళ్లు, కార్లపై దట్టంగా మంచు వర్షం కురుస్తుండడంతో అంతా మంచుమయం అయిపోతుంది. అటు పర్వత ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తున్న దృశ్యాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కొండలన్నీ దట్టమైన పొగమంచుతో కప్పుకొని ఉండడంతో మంచు అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు కొండచరియలు విరిగిపడి దిగువ ప్రాంతాలపై పడుతున్నాయి. మంచు చరియలు విరిగి పడుతుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి మంచు చరియ విరిగిపడుతుందో అన్న భయం వారిని వెంటాడుతోంది.
Next Story




