Sherry Singh: 48వ మిసెస్ యూనివర్స్‌గా షెర్రీ సింగ్

Mrs Universe 2025: ఫిలిప్పీన్స్ మనీలాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత పతాకం రెపరెపలాడింది.

Arun Chilukuri
Published on: 13 Oct 2025 11:13 AM IST
Sherry Singh: 48వ మిసెస్ యూనివర్స్‌గా షెర్రీ సింగ్
X

Sherry Singh: 48వ మిసెస్ యూనివర్స్‌గా షెర్రీ సింగ్ 

Mrs Universe 2025: ఫిలిప్పీన్స్ మనీలాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత పతాకం రెపరెపలాడింది. భారత్‌కు చెందిన షెర్రీ సింగ్‌ మిసెస్‌ యూనివర్స్‌ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. మనీలాలో జరిగిన 48వ ఎడిషన్‌ పోటీలో షేర్రీ 120 మందితో పోటీ పడి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

షెర్రీ సింగ్‌కి తొమ్మిది ‎ఏళ్ల క్రితం వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె అంతర్జాతీయ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన తర్వాత.. ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదని.. హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదని తెలిపారు. బలం, దయ, పట్టుదల.. మహిళ నిజమైన అందానికి నిదర్శనమని.. నేను ప్రపంచానికి చూపించాలనుకున్నానని తెలిపారు. అమెను విజేతగా ప్రకటించిన తర్వాత ఆమె భారత జెండాను చేతబట్టి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్‌ను గర్వపడేలా చేసిందని.. మిసెస్ యూనివర్స్‌ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story