కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఎంపీ శశిథరూర్!

Shashi Tharoor: అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో శశిథరూర్

Jyothi
Updated on: 30 Aug 2022 12:44 PM IST
Shashi Tharoor Planning To Run For Congress President
X

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఎంపీ శశిథరూర్!

Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో థరూర్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నికలు స్వేచ్చగా, పారదర్శకంగా జరగాలని శశిథరూర్ అంటున్నారు. ఇక వచ్చే నెల 22న కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. అక్టోబర్‌ 19న అధ్యక్షుడిని ప్రకటిస్తారు. కాంగ్రెస్‌లో సంస్థాగత సంస్కరణలు కోరుతూ 2020లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన జీ23 మంది నేతల బృందంలో తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కూడా ఉన్నారు.


Jyothi

Jyothi

Next Story