ప్రధాని మోదీ టీమ్‌లో శక్తికాంత దాస్‌కు కీలకమైన పోస్ట్

Pavan Reddy
Updated on: 22 Feb 2025 11:54 PM IST
shaktikanta das appointed as principal secretary 2 to pm modi
X

ప్రధాని మోదీ టీమ్‌లో శక్తికాంత దాస్‌కు కీలక పదవి

Shaktikanta Das gets key post in Modi govt: ప్రధాని నరేంద్ర మోదీ టీమ్‌లో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్ కు కీలకమైన పోస్ట్ దక్కింది. ఆయన్ను ప్రధాని మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2 గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాని మోదీ ఆ పదవిలో ఉన్నంత కాలం లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు శక్తికాంత దాస్ ఆ పోస్టులో కొనసాగుతారు. కేబినెట్ అపాయింట్స్ కమిటీ ఈ ఉత్తర్వులు జారీచేసింది.

ఇప్పటికే ప్రధాని మోదీ వద్ద ప్రమోద్ కుమార్ మిశ్రా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. 2019 సెప్టెంబర్ 11 నుండి ప్రమోద్ కుమార్ మిశ్రా ఆ పొజిషన్ లో కొనసాగుతున్నారు. గతేడాది ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే, జూన్ 2024 లో కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ మరోసారి ఆయన్ను అదే పదవిలో నియమించింది.

శక్తికాంత దాస్ గతంలో ఏం చేశారంటే...

శక్తికాంత దాస్ గతంలో ఆర్థిక శాఖలో రెవిన్యూ, ఆర్థిక వ్యవహారాల విభాగాలకు కార్యదర్శిగా పనిచేశారు. 2018 డిసెంబర్ 12న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా కేంద్రం ఆయన్ను అపాయింట్ చేసింది. అంతేకాకుండా 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగానూ పనిచేశారు. కొంతకాలంపాటు G20 సదస్సుకు భారత షెర్పాగా సేవలు అందించారు. షెర్పా అంటే ఏదైనా ఒక అంతర్జాతీయ సదస్సు కోసం ఒక దేశం తరపున పనిచేసే ప్రతినిధి. రాయబారుల తరహాలోనే షెర్పాగా సివిల్ సర్వెంట్స్‌ను నియమిస్తుంటారు.

ఎనిమిదిసార్లు కేంద్ర బడ్జెట్ల రూపకల్పనలో ఆయన పాత్ర కీలకం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో శక్తికాంత దాస్ అనేక కీలక పదవుల్లో పనిచేశారు. ఆర్థిక శాఖ, పన్నులు, పరిశ్రమలు, మౌళిక వసతులు రంగాల్లో శక్తికాంత దాస్ ఎక్స్‌పర్ట్. కేంద్రంలో 8 ఏళ్ల పాటు బడ్జెట్స్ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Also watch this video : New coronavirus in China: చైనాలో ప్రాణాంతకమైన మరో కొత్త కరోనావైరస్

Pavan Reddy

Pavan Reddy

Next Story