Maharashtra: మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురి మృతి !

Maharashtra: శానిటైజర్‌ తాగి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని యావత్మల్‌ తహసీల్‌లో చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 24 April 2021 5:55 PM IST
Seven people died in Maharashtra After Drinking Sanitiser
X

Maharashtra: మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురి మృతి!

Maharashtra: శానిటైజర్‌ తాగి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని యావత్మల్‌ తహసీల్‌లో చోటు చేసుకుంది. కొవిడ్‌-19 నిబంధనలతో మద్యం అమ్మకాలను నిలిపివేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు సమాచారంతో శానిటైజర్‌ తాగడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఐదుగురు 35 ఏళ్లలోపు వారుండగా ఇద్దరు 47 ఏళ్లలోపు వ్యక్తులు ఉన్నారు. మరణించిన వారంతా కూలీలుగా పోలీసులు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story