CM Stalin: సేతు సముద్రం ప్రాజెక్టును కొనసాగించాలి

CM Stalin: గతంలో జయలలిత కూడా మద్దతు తెలిపారన్న స్టాలిన్

Dhatripriya
Published on: 12 Jan 2023 7:01 PM IST
Sethusamudram project should be continued
X

CM Stalin: సేతు సముద్రం ప్రాజెక్టును కొనసాగించాలి

Sethusamudram: సేతు సముద్రం ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయానికి తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ కూడా మద్దతు తెలిపింది. రాజకీయ కారణాల వల్ల సేతు సముద్రం ప్రాజెక్టును బీజేపీ వ్యతిరేకించిందని అప్పట్లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాజెక్ట్‌కు అనుకూలంగా ఉన్నారని గుర్తుచేశారు. అయితే అకస్మాత్తుగా జయలలిత తన స్టాండ్ మార్చుకున్నారని కేసు కూడా పెట్టారని తమిళనాడు CM చెప్పుకొచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story