సీరమ్ వ్యాక్సిన్‌కు త్వరలోనే ఆమోదం

సీరమ్ వ్యాక్సిన్‌కు త్వరలోనే ఆమోదం
x
Highlights

బ్రిటన్‌లో ప్రకంపనలు రేపుతున్న మరో ప్రమాదకరమైన కరోనా వైరస్‌ ఉనికి తెలంగాణలో కూడా ఉందన్న అంచనాల మధ్య దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరం కీలక...

బ్రిటన్‌లో ప్రకంపనలు రేపుతున్న మరో ప్రమాదకరమైన కరోనా వైరస్‌ ఉనికి తెలంగాణలో కూడా ఉందన్న అంచనాల మధ్య దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరం కీలక విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌కు మరికొన్నిరోజుల్లో అత్యవసర ఉపయోగానికి ఆమోదం లభించనుంది. వ్యాక్సిన్‌ ప్రయోగాలకు సంబంధించిన సీరం సమర్పించిన లేటెస్ట్‌ డేటా సంతృప్తికరంగా ఉంది. దీంతో త్వరలోనే వ్యాక్సిన్‌ అత్యసర వినియోగానికి ప్రభుత్వ అనుమతి లభించనుందని ఆశిస్తున్నట్టు పూనావాలా తెలిపారు. ఇప్పటికే 40 మిలియన్ల నుంచి 50 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్ సిద్దంగా ఉందని చెప్పారు. డేటా విశ్లేషణ పూర్తైన తర్వాత, టీకాకు అనుమతినిచ్చేందుకు యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదం కోసం భారత ప్రభుత్వం వేచి ఉండకపోవచ్చని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories