వ్యాక్సిన్ వేళ కనిపించిన కొత్త వివాదం: స్వయంగా క్లారిటీ ఇచ్చిన సీరమ్, భారత్ బయోటెక్

వ్యాక్సిన్ వేళ కనిపించిన కొత్త వివాదం: స్వయంగా క్లారిటీ ఇచ్చిన సీరమ్, భారత్ బయోటెక్
x
Highlights

టీకా రాబోతున్న వేళ.. రెండు సంస్థల వివాదం సరికొత్త చర్చకు దారితీయగా.. దీనిపై సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు క్లారిటీ ఇచ్చాయ్. ప్రపంచానికి టీకా ఇప్పుడు...

టీకా రాబోతున్న వేళ.. రెండు సంస్థల వివాదం సరికొత్త చర్చకు దారితీయగా.. దీనిపై సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు క్లారిటీ ఇచ్చాయ్. ప్రపంచానికి టీకా ఇప్పుడు ఎంతో అవసరం అని దాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయ్.

వ్యాక్సిన్ కంటే ముందు వివాదాలు వచ్చి చేరాయ్ ! జనాల్లోంచే కాదు రాజకీయ పార్టీల్లోంచి కూడా ఇలాంటి మాటలే వినిపించాయ్. దీంతో మళ్లీ మొదలు అనుమానాలు టీకా వస్తుందా రాదా అని ! ఐతే అటు కేంద్రం మాత్రం తేదీ కూడా చెప్పేసింది వ్యాక్సిన్ ఎప్పుడు తెస్తామా అని ! ఐతే వ్యాక్సిన్లకు తొందరపాటుగా అనుమతులు ఇస్తున్నారంటూ విపక్షాల నుంచి విమర్శలు మొదలవగా వీటిపై స్పందించిన తయారీ సంస్ధలు సీరం ఇన్‌స్డిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

వ్యాక్సిన్ విదేశీ ఎగుమతులపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు వినిపించాయ్. కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందనుకోండి ! ఇక భారత్ బయోటెక్ విషయంలోనూ గందరగోళం చెలరేగినా ఉమ్మడి ప్రకటనలో క్లారిటీ ఇస్తామన్న సీరమ్ సంస్థ సీఈవో చెప్పింది చేశారు. వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించడమే తమ లక్ష్యమంటూ సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు సంయుక్థంగా ప్రకటన విడుదల చేశాయ్. ప్రపంచానికి ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ ఎంత అవసరం ఉంది, దాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను వివరంగా ప్రకటించాయ్.

తమ రెండు కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని మనదేశంతో పాటు ప్రపంచానికి టీకా పంపిణీ సజావుగా జరిగేలా చూడటం తమ కర్తవ్యమని రెండు సంస్ధలూ ప్రకటించాయి. తమ సంస్ధలు వ్యాక్సిన్ల అభివృద్ధి కార్యకలాపాలను ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తాయని తెలిపారు. ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ల అవసరం ఎంత ఉందో తమకు పూర్తిగా తెలుసు అని తెలిపాయి. తమ వ్యాక్సిన్లకు ప్రపంచ ప్రాప్తిని అందించేందుకు ఉమ్మడి ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చెప్పారు.

ప్రజల జీవితాలు, జీవనోపాధిని పరిరక్షించడమే ముందున్న ప్రధాన కర్తవ్యమని తమ టీకాలకు జీవితాలను కాపాడే శక్తి ఉందని ప్రకటనలో రెండు సంస్థలు తెలిపాయ్. ఆర్థిక వ్యవస్థను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడాన్ని వేగవంతం చేస్తాయని వెల్లడించాయ్. తాము టీకాల తయారీ, సరఫరా, పంపిణీపై దృష్టి సారించామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories