Sushil Kumar Modi: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కన్నుమూత‌

Sushil Kumar Modi: గ‌త కొంత‌కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సుశీల్ కుమార్ మోడీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 May 2024 9:07 AM IST
Senior BJP Leader Sushil Kumar Modi Dies Of Cancer At 72
X

Sushil Kumar Modi: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కన్నుమూత‌

Sushil Kumar Modi: బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా వెల్లడించారు. గ‌త కొంత‌కాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాత్రి 9.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింద‌ని, ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన‌లేనని సుశీల్ కుమార్ మోడీ గత నెలలో ప్రకటించారు. బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ మృతి ప‌ట్ల ప్రధాని న‌రేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయ‌న అకాల మరణం త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌ని ట్వీట్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story