Sejal: ఢిల్లీలో కేసీఆర్ ఫ్లెక్సీకి శేజల్ పాలాభిషేకం

Sejal బెల్లంపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోనందుకు నిరసన

Dhatripriya
Published on: 13 Jun 2023 3:08 PM IST
Sejal Palabhishekam To KCR Flex In Delhi
X

Sejal: ఢిల్లీలో కేసీఆర్ ఫ్లెక్సీకి శేజల్ పాలాభిషేకం 

Sejal: ఢిల్లీలో పోరాటం సాగిస్తున్న ఆరిజన్ డెయిరీ ప్రతినిధి శేజల్ ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. మహిళా సంక్షేమం కోసం ఎన్నో చేస్తున్న సీఎం కేసీఆర్ తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతుంటే స్పందించడం లేదన్నారు. దుర్గం చిన్నయ్యపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. నిరసన తెలపడంలో భాగంగానే కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశానని చెప్పారు. బెల్లంపల్లి పోలీసులు దొంగలకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తమకు ప్రభుత్వ భూమిని అమ్మడంతో పాటు లైంగికంగా వేధించిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని శేజల్ మరోసారి డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story