అజిత్‌దోవల్‌పై దాడికి ఉగ్రవాదులు కుట్ర

Arun Chilukuri
Published on: 13 Feb 2021 9:53 PM IST
అజిత్‌దోవల్‌పై దాడికి ఉగ్రవాదులు కుట్ర
X

జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌దోవల్‌పై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కీ నిర్వహించినట్లు తెలియడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాది ఉల్లా మాలిక్‌ను ఈ నెల 6న కాశ్మీర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2019 మే నెలలో దోవల్‌ ఇంటిపై రెక్కీ నిర్వహించినట్లు విచారణ సందర్భంగా మాలిక్‌ చెప్పాడు. ఉగ్రవాది ఇచ్చిన సమాచారాన్ని కాశ్మీర్‌ పోలీసులు ఢిల్లీ పోలీసులకు తెలిపారు. దీంతో అజిత్‌ దోవల్‌ ఇల్లు, కార్యాలయం దగ్గర భద్రత పెంచారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story