Indian Bank: ఇండియన్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ పోస్టులు.. వారు మాత్రమే అర్హులు..

Indian Bank: ఇండియన్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది...

Shireesha
Updated on: 3 March 2022 5:01 PM IST
Security Guard Posts in Indian Bank Qualification 10th Pass | Bank Job Notifications 2022
X

Indian Bank: ఇండియన్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ పోస్టులు.. వారు మాత్రమే అర్హులు..

Indian Bank: ఇండియన్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తే నోటిఫికేషన్‌ గురించి పూర్తి సమాచారం అందుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులు 202 ఉన్నాయి. పదో తరగతి చదివి ఉండి గతంలో ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి. 9 మార్చి 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

UG లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయలేరు. 26 నుండి 29 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి కనీస విద్యార్హత 10వ తరగతి (S.S.C./మెట్రిక్యులేషన్) లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర విద్యా బోర్డు నుండి తత్సమానం పాస్ అయి ఉండాలి.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

1. అభ్యర్థులు ముందుగా ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.inకి వెళ్లండి. హోమ్‌పేజీలో కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

2. ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇచ్చిన 'సెక్యూరిటీ గార్డ్స్ రిక్రూట్‌మెంట్' లింక్‌పైక్లిక్ చేయండి.

3. అభ్యర్థి అభ్యర్థించిన సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా ఫారమ్‌ను సమర్పించండి.

4. భవిష్యత్ సూచన కోసం అదే హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోండి.

5. మిగతా వివరాలకు అధికారికి నోటిఫికేషన్ చదవండి.

Shireesha

Shireesha

Next Story