PM Modi: ప్రధాని మోడీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం.. మోడీకి దండ వేసేందుకు వ్యక్తి యత్నం

PM Modi: 29వ జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా మోడీ టూర్

Jyothi
Published on: 12 Jan 2023 5:33 PM IST
Security Breach During PM Modi Roadshow In Karnataka
X

PM Modi: ప్రధాని మోడీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం.. మోడీకి దండ వేసేందుకు వ్యక్తి యత్నం

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కర్నాటక పర్యటనలో కలకలం రేగింది. ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. భద్రతా సిబ్బందిని దాటుకొని ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. ప్రధాని మోడీకి దండ వేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మోడీ టూర్‎లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలో రోడ్ షో నిర్వహిస్తున్న మోడీ... 29వ జాతీయ యువనోత్సవాలను ప్రారంభించారు. బెంగళూరు, హుబ్బలిలో భారీ ఎత్తున జరిగిన రోడ్ నిర్వహించారు . దాదాపు ఈ ఉత్సవాల్లో 30వేల మంది యువతీ, యువకులు పాల్గొన్నారు. యువనోత్సవాలను పురష్కరించుకొని కర్నాటక ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రైల్వే స్పోర్ట్స్‌ గ్రౌండ్‌లో ఉత్సవాలను ఏర్పాటు చేశారు. యువనోత్సవాల్లో భాగంగా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 5రోజులు పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది.

Jyothi

Jyothi

Next Story