Seasonal Diseases: విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ ఫీవర్స్‌

Seasonal Diseases - Delhi: ఇప్పటివరకు దేశ రాజధానిలో 480 డెంగ్యూ కేసులు నమోదు...

Shireesha
Updated on: 12 Oct 2021 9:42 PM IST
Seasonal Diseases and Dengue Cases Increasing In Delhi | National News Today
X

Seasonal Diseases: విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ ఫీవర్స్‌

Seasonal Diseases - Delhi: దేశవ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. ఢిల్లీలో ఒక్కసారిగా డెంగ్యూ కేసుల నమోదు కలకలం రేపుతోంది. కేవలం రెండు వారాల్లో 139 కేసులు నమోదవగా, సెప్టెంబర్‌లో 217 డెంగ్యూ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఢిల్లీలో 480 మంది డెంగ్యూ బారిన పడి ఇబ్బందిపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

విశాఖలో కూడా డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. వైరల్‌ ఫీవర్స్‌తో ఆసుపత్రుల్లో రోగులు క్యూ కడుతున్నారు. వాతావరణ మార్పులే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వస్తే తమను సంప్రదించాలంటున్న డాక్టర్లు, సొంత వైద్యం చేసుకోవద్దని సూచనలు చేస్తున్నారు. డెంగ్యూ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలంటున్నారు.


Shireesha

Shireesha

Next Story