Breaking News: కన్యాకుమారిలో వెనక్కి వెళ్లిన సముద్రం

Sea Water Went Back 2 km in Kanyakumari and Antervedi in AP Because of Sea Earthquake | Breaking News
x

కన్యాకుమారిలో వెనక్కి వెళ్లిన సముద్రం

Highlights

Breaking News: * సముద్రం వెనక్కి వెళ్లడంతో బయటపడిన బండరాళ్లు * రెండ్రోజుల క్రితం బంగాళాఖాతంలో భూపంకం

Breaking News: బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం కారణంగా పలు చోట్ల సముద్రం వెనక్కి వెళ్లింది. ఏపీలోని అంతర్వేది వద్ద రెండు కిలోమీటర్లకు పైగా సముద్రం వెనక్కి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని ప్రసిద్ధ కన్యాకుమారిలో కూడా సముద్రం వెనక్కి వెళ్లడంతో.. బండరాళ్లు బయటపడ్డాయి. మరోవైపు సముద్రం వెనక్కి వెళ్లడంతో పలుచోట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో భూకంపం రావడం, అలలు అసహజంగా ఉండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రగర్భంలో తీవ్ర మార్పులు జరిగే సమయంలో అలలు ప్రశాంతంగా ఉంటాయని... విపత్తు చోటు చేసుకునే ముందు ఉండే ప్రశాంతతలాంటిదని జాలరులు చెపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories