Coronavirus: వార్తా పత్రికలతో కోవిడ్‌ సోకుతుందా?

Coronavirus: వార్తా పత్రికలతో కోవిడ్‌ సోకుతుందా?
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.కరోనా వైరస్ వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా వార్తా పత్రికల ద్వారా కూడా కరోనా వైరస్ సోకె ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఈ ప్రచారంతో పలు వార్తా పత్రిక సంస్థలు తాత్కాలికంగా మూసివేయడానికి కూడా సిద్ధమయ్యాయి. అయితే వాస్తవానికి పత్రికలతో వైరస్‌ వ్యాప్తి చెందుతుందనేందుకు శాస్త్రీయ ఆధారమేదీ లేదు.

అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌తో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్ కొన్ని ఉపరితలాలపై వేర్వేరు కాలాలపాటు మనుగడ సాగించిందని పేర్కొంది. ఈ వివరాలు గత వారం న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం కార్డ్‌బోర్డు, రాగి వంటి వాటిపై వైరస్‌ తక్కువ కాలం అంటే నిమిషాల పాటే బతుకుతుంది. నున్నటి, కన్నాలులేని ఉపరితలాలపై ఎక్కువకాలం జీవిస్తాయట. గాలి సోకినప్పుడు ఈ వైరస్‌ తీవ్రత తగ్గుతూ పోతుందని, ప్రతి 66 నిమిషాలకు వైరస్‌ సామర్థ్యం సగానికి పడిపోతుందని.. ఉపరితలంపై వైరస్ దిగిన మూడు గంటల తర్వాత అంటువ్యాధులలో ఎనిమిదవ వంతు మాత్రమే ఉంటుంది మరియు ఆరు గంటల తర్వాత 2% శక్తిని కలిగి ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

ఇదిలావుంటే వార్తా పత్రికలను ముట్టుకుంటే కోవిడ్‌ వ్యాపిస్తుందనడంలో వాస్తవం ఏమాత్రమూ లేదు. "వార్తాపత్రికలు చాలా శుభ్రమైనవి, ఎందుకంటే అవి ముద్రించబడిన విధానం మరియు తయారు చేసిన ప్రక్రియ ఆరోగ్యకరమైనది. సాంప్రదాయకంగా, కొందరు ప్రజలు వాటిలోనే చేపలు మరియు చిప్స్ పెట్టుకొని తింటారు. అందులో ఉండే సిరా మరియు ముద్రణ పేపర్ ను శుభ్రపరుస్తాయి" అని నార్విచ్‌లోని జాన్ ఇన్నెస్ సెంటర్‌లోని కెమిస్ట్రీ విభాగంలో ప్రాజెక్ట్ లీడర్ ప్రొఫెసర్ జార్జ్ లోమోనోసాఫ్ బిబిసికి చెప్పారు. అంతేకాదు అగ్రరాజ్యం అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) కూడా వార్తా పత్రికలు అందివ్వడం, అందుకోవడం వంటి చర్యల వల్ల కోవిడ్‌ వ్యాప్తి చెందదని తెలిపింది. అలాగే వార్తా పత్రికలను ముట్టుకోవడం, చదవడం వల్ల ఎలాంటి ముప్పు లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రశ్నోత్తరాల కాలమ్‌లో స్పష్టంగా తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories