'కలి'కాలం.. అబ్బాయి కోసం తన్నుకున్న అమ్మాయిలు

School Girls Fighting on Street in Bengaluru
x

'కలి'కాలం.. అబ్బాయి కోసం తన్నుకున్న అమ్మాయిలు

Highlights

Bengaluru: బెంగళూరులోని ఓ కాన్వెంట్ స్కూల్ అమ్మాయిలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు.

Bengaluru: బెంగళూరులోని ఓ కాన్వెంట్ స్కూల్ అమ్మాయిలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. బిషప్ కాటన్స్ గాళ్స్ స్కూల్లో ఈ సంఘటన జరిగింది. అమ్మాయిలంతా జుట్లు పట్టుకొని లాగేసుకున్నారు. కర్రలతో బాదుకున్నారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో బండబూతులు తిట్టుకున్నారు. ఇదంతా ఎందుకో తెలిస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఓ అబ్బాయితో డేటింగ్ పై అమ్మాయిల్లోని రెండు గ్రూపుల మధ్య ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

ఆ అబ్బాయి కోసం కొట్టుకుంటున్నారా లేక అమ్మాయిల్ని అబ్బాయి తెలివిగా వాడుకుంటున్నాడన్న కోపంతో కొట్టుకుంటున్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాన్వెంట్ విద్యను ఎంతో గొప్పగా ఊహించుకొని పంపించే తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి అంశాలు చూశాక పునరాలోచించాలన్న అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories