స్కూల్ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి..

Rajasthan: రాజస్థాన్​లోని జైసల్మేర్​లో దారుణం జరిగింది. జైసల్మేర్​లో జరిగిన ఓ స్కూల్​ బస్​ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

Arun Chilukuri
Updated on: 17 Feb 2022 9:00 PM IST
School Bus Accident In Rajasthan
X

స్కూల్ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి..

Rajasthan: రాజస్థాన్​లోని జైసల్మేర్​లో దారుణం జరిగింది. జైసల్మేర్​లో జరిగిన ఓ స్కూల్​ బస్​ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఫల్సుండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షియో రోడ్డులో జరిగింది. గాయాలైన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కొందరు విద్యార్థులు ఆస్పపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వివరించారు.

మరో 20 మంది చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. చనిపోయిన ఇద్దరిని హసమ్​ ఖాన్, కసమ్ ఖాన్‌గా గుర్తించారు. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​ నగర్​లోనూ రెండు స్కూల్​ బస్సులు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story