నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట

Nupur Sharma: BJP బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.

Arun Chilukuri
Updated on: 10 Aug 2022 9:30 PM IST
SC Orders Clubbing of FIRs Against Nupur Sharma
X

నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట

Nupur Sharma: BJP బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. తనకు ప్రాణహాని ఉందన్నపిటిషన్‌పై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. నుపుర్ శర్మపై దాఖలైన అన్ని కేసులను ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దని సూచించింది. తనపై నమోదైన అన్ని FIRలను కొట్టివేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను నుపుర్ శర్మకు ఇస్తున్నట్టు ప్రకటించింది. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story