శశికళ ముందస్తు విడుదల ఆశలపై నీళ్లు చల్లిన కర్ణాటక హోం మంత్రి

Arun Chilukuri
Updated on: 21 Nov 2020 8:01 AM IST
శశికళ ముందస్తు విడుదల ఆశలపై నీళ్లు చల్లిన కర్ణాటక హోం మంత్రి
X

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ముందస్తు విడుదల ఆశలపై కర్ణాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై నీళ్లు చల్లారు. శశికళ ముందస్తుగా జైలు నుంచి విడుదల కావడం అసాధ్యమని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పూర్తి శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో మరో ఒకటి రెండు రోజుల్లో బయటకు వస్తారన్న శశికళ బంధువులు, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story