ఆస్పత్రి నుంచి ఢిశ్చార్జ్ అయిన శశికళ.. కారు ముందు భాగంలో అన్నాడీఎంకే జెండా

శశికళను చూసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు

Samba Siva Rao
Published on: 31 Jan 2021 8:18 PM IST
ఆస్పత్రి నుంచి ఢిశ్చార్జ్ అయిన శశికళ.. కారు ముందు భాగంలో అన్నాడీఎంకే జెండా
X

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జైలు నుంచి విడుదలైన శశికళ.. గత పది రోజులుగా బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. శశికళకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు ఇప్పటికే తెలిపారు. ఈ సందర్భంగా శశికళను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. త్వ‌ర‌లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆమె విడుద‌లవుతుండ‌డంతో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story