Sasikala: ఓటరు జాబితా నుంచి శశికళ పేరు మాయం

Sasikala: ఓటేసే అవకాశాన్ని కోల్పోయిన చిన్నమ్మ * 30 ఏళ్లుగా థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో శశికళకు ఓటు

Sandeep Eggoju
Published on: 6 April 2021 9:59 AM IST
Sasikala Name Missing in Voter List
X
శశికళ (ఫైల్ ఇమేజ్)

Sasikala: చిన్నమ్మ శశికళ పేరు ఓటరు జాబితా నుంచి గల్లంతైంది. తమిళనాడులో ఎన్నికలు కొనసాగుతుండగా, ఓటరు జాబితాలో పేరు లేని కారణంగా శశికళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోయారు. మూడు దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ చిరునామాలోనే ఉంటున్న శశికళ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు వేస్తున్నారు.

2017లో జైలుకు వెళ్లిన తర్వాత జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అక్కడే నివసిస్తున్న శశికళ, ఇళవరసి సహా 19 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమకు తిరిగి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ శశికళ, ఇళవరసి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. మరోవైపు, శశికళ పేరును జాబితాలో చేర్చకపోవడంపై థౌజండ్ లైట్స్ ఏఎంఎంకే అభ్యర్థి వైద్యనాథన్ నిన్న ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story