తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శశికళ కీలక భేటీ

Sasikala Meets Rajinikanth in Chennai
x

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శశికళ కీలక భేటీ

Highlights

Sasikala: అన్నాడీఎంకెలోకి శశికళకు ఎంట్రీ లేకుండా బైలాస్ మార్చిన దగ్గర నుంచీ తమిళనాట పాలిటిక్స్ హాట్‌ టాపిక్ అవుతున్నాయి.

Sasikala: అన్నాడీఎంకెలోకి శశికళకు ఎంట్రీ లేకుండా బైలాస్ మార్చిన దగ్గర నుంచీ తమిళనాట పాలిటిక్స్ హాట్‌ టాపిక్ అవుతున్నాయి. మొన్న జయ వర్ధంతి సాక్షిగా శశికళ, పళని వర్గాలు బలప్రదర్శనతో కాక రేపితే తాజాగా సూపర్ స్టార్ రజనీతో శశికళ సంచలన భేటీ తమిళ రాజకీయాల్ని షేక్ చేస్తోంది.

చెన్నైలోని పొయెస్ గార్డెన్‌లో ఉన్న రజనీ నివాసానికి వెళ్లిన శశికళ తలైవాతో భేటీ అయ్యారు. రజనీ, ఆయన అర్ధాంగి లతతో ఆమె ముచ్చటించారు. రజనీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం పట్ల రజనీని ఆమె అభినందించారు. ఈ భేటీపై పొలిటికల్ హీట్ పెరిగిన నేపధ్యంలో స్పందించిన శశికళ వర్గం ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమే అని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories