తగ్గిన శానిటైజర్ అమ్మకాలు.. జాగ్రత్తలను గాలికి వదిలేసిన ప్రజలు

తగ్గిన శానిటైజర్ అమ్మకాలు.. జాగ్రత్తలను గాలికి వదిలేసిన ప్రజలు
x
Highlights

శానిటైజర్ కరోనా కాలంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఎవరిని టచ్ చేసినా చేతుల్లో శానిటైజర్ పడాల్సిందే చేతులతో...

శానిటైజర్ కరోనా కాలంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఎవరిని టచ్ చేసినా చేతుల్లో శానిటైజర్ పడాల్సిందే చేతులతో రుద్దాల్సిందే. అసలు లాక్ డౌన్ సమయంలో శానిటైజర్ దొరకడమే గగనమైంది. ఆర్డర్లు ఇచ్చినా దొరకని పరిస్థితి. కానీ ఇప్పుడు శానిటైజర్ వాడకాన్ని తగ్గించారు జనం. కరోనా రాదనే నమ్మకమో లేదంటే వైరస్ లేదని ధైర్యమో కానీ శానిటైజర్ కొనుగోలు అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి.

లాక్ డౌన్ సమయంలో శానిటైజర్ లభిస్తే దేవుడు వరమిచ్చినట్లు జనాలు ఫీలయ్యారు. పలనా షాపులో శానిటైజర్లు ఉన్నాయని తెలిస్తే చాలు ఆ షాపు ఎదుట క్యూ కట్టేవాళ్లు. ఇక తర్వాత రోజుల్లో మార్కెట్లోకి విరివిగా శానిటైజర్లు వచ్చేశాయి. బయటకు వెళ్లే వాళ్లు తప్పని సరిగా శానిటైజర్ వాడేవాళ్లు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. మెడికల్ షాపుల్లో శానిటైజర్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కు పంపే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే శానిటైజర్ల వాడకాన్నిజనాలు పూర్తిగా తగ్గించారు.

కరోనా కాలాన్ని క్యాష్ చేసుకునేందుకు చాలా కంపెనీలు శానిటైజర్ల తయారీని మొదలుపెట్టాయి. కానీ ఇప్పుడు అమ్ముడుపోక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఇటు డిస్ట్రిబ్యూటర్లు కూడా పెట్టినపెట్టుబడి రావడం లేదని వాపోతున్నారు. నిజానికి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరం. కానీ జనంలో భయం తగ్గడంతో జాగ్రత్తలను గాలికి వదిలేశారు. ఒకవేళ వైరస్ సోకినా సింపుల్ గా తగ్గిపోతుందిలే అన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఇటు రికవరీ రేటు పెరిగి, మరణాల రేటు తగ్గుముఖం పట్టడంతో జనాలకు కరోనా అంటే భయం లేకుండా పోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories