Salman khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి దగ్గర కాల్పులు.. తాపీ నదిలో దొరికిన రెండో తుపాకీ

Salman khan: తాపీ నదిలో దొరికిన రెండో తుపాకీ..

Shashank Gullapelli
Published on: 23 April 2024 5:37 PM IST
Salman Khan Mumbai Crime Branch Recovers Second Gun Used In The Crime From Tapi River In Surat
X

Salman khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి దగ్గర కాల్పులు.. తాపీ నదిలో దొరికిన రెండో తుపాకీ

Salman khan: సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసు దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు నిందితులు ఉపయోగించిన రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో సూరత్ లోని తాపీ నదిలో పోలీసులు గాలింపు చేపట్టారు.. సోమవారం ఒక తుపాకీ లభించగా.. ఇవాళ రెండో తుపాకి దొరికింది. వికీ గుప్తా, సాగర్ పాల్ అనే నిందితులు ఈనల 14న ముంబైలోని బాంద్రా ఏరియాలో సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్ మెంట్ దగ్గర కాల్పులకు పాల్పడ్డారు. గుజరాత్ కు పారిపోయిన నిందితులను ఈనెల 16న అరెస్ట్ చేశారు

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story