Maharashtra: ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ సచిన్‌వాజే చుట్టు బిగుస్తున్న ఉచ్చు

Maharashtra: ముంబైలో ఎన్‌‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ సచిన్‌ వాజే చుట్టూ అల్లుకున్న ఉచ్చు మరింత బిగుసుకుంటోంది.

Arun Chilukuri
Updated on: 3 April 2021 10:01 PM IST
Sachin Vaze’s Custody Extended Till April 7
X

Maharashtra: ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ సచిన్‌వాజే చుట్టు బిగుస్తున్న ఉచ్చు

Maharashtra: ముంబైలో ఎన్‌‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ సచిన్‌ వాజే చుట్టూ అల్లుకున్న ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ముఖేశ్‌ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో ఇప్పటికే వాజే అరెస్టయ్యాడు. రెండు దఫాలుగా కష్టడీలోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు మరోసారి కస్టడీ కోరారు.

వాజేను ఇంకో ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకోవడానికి కోర్టు అనుమతించింది. పేలుడు పదార్థాలున్న స్కార్పియో యజమాని మన్సుఖ్‌ హిరేన్‌ అనుమానాస్పద మృతి చెందాడు. ఈ కేసులో అనుమానాస్పదంగా కనిపించిన సచిన్‌ వాజేను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. దీంతో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వమే ఈ కేసుతో ఊగిసలాడుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story